కింగ్ ఖాన్ ని ఆట ఆడించనున్న ఎన్టీఆర్ డైరెక్టర్

బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ లాస్ట్ సినిమా 2018లో రిలీజ్ అయ్యింది. అప్పటినుంచి ఖాళీగానే ఉన్న షారుఖ్, లూప్ లైన్ లో భారీ సినిమాలని పెట్టాడు. 2013లో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ తర్వాత షారుఖ్ ఖాన్ కి సరైన హిట్ పడలేదు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేసినా కమర్షియల్ సినిమా చేసిన రిజల్ట్ మాత్రం నెగటివ్ గానే వచ్చింది. ఏడేళ్లుగా హిట్ అనే మాటే లేకపోవడంతో షారుఖ్ ఖాన్ టైం అయిపోయిందని బాలీవుడ్ వర్గాల్లో కామెంట్స్ వినిపించాయి. ఖాన్ సాబ్ అవన్నీ పట్టించుకోకుండా రెండేళ్లు గ్యాప్ తీసుకోని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. షారుక్ మూడు భారీ సినిమాలని లైన్ లో పెట్టినా కూడా అందరి చూపు షారుఖ్ అండ్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపైనే ఉంది. చాలా రోజులుగా వినిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చి షారుఖ్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మధ్య డిజైన్ చేసిన స్క్రిప్ట్ లో షారుఖ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడట. హీరో విలన్ గా రెండు పాత్రలు చేయడం షారుఖ్ కి కొత్తేమి కాదు కానీ సౌత్ డైరెక్టర్ తో అంత రిస్క్ చేయడమే అందరికీ షాక్ ఇస్తుంది.

నిజానికి అట్లీ ట్రాక్ రికార్డు చూస్తే సౌత్ స్టార్ హీరో విజయ్ లాంటి వ్యక్తినే డబల్ రోల్, ట్రిపుల్ రోల్ లో చూపించి కోలీవుడ్ బాక్సాఫీస్ ని కొల్లగొట్టేశాడు. తమిళనాట కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పిన అట్లీకి షారుఖ్ ని డ్యూయల్ రోల్ లో హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు, ఎందుకంటే షారుఖ్ ముందుగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న పఠాన్, ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్న సినిమాలు చేయనున్నాడు. వచ్చే మూడేళ్లు షారుఖ్ ఈ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండనున్నాడు. ఈ కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక షారుఖ్ అట్లీ కలవనున్నారు. ఈలోపు అట్లీ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉంది. అశ్వినీ దత్ అనౌన్స్ చేసిన ఈ కాంబో భారీ హైప్ పెంచింది. ఆ హైప్ కి తగ్గట్లే, అట్లీ ఎన్టీఆర్ కలయిక ఉండబోతుంది. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్, అది అవ్వగానే త్రివిక్రమ్ తో, ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూడు సినిమాలు కంప్లీట్ అవగానే ఎన్టీఆర్ అట్లీ ప్రాజెక్ట్ ఉండబోతోంది. ఆ లోపు షారుఖ్ కూడా తనకున్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేస్తాడు కాబట్టి అట్లీ బాలీవుడ్ మూవీని మొదలుపెట్టే అవకాశం ఉంది.