18 ఏళ్ల తర్వాత కూడా అదే ఫన్ రైడ్…

2003లో ప్రియదర్శన్ దర్శకత్వంలో హిందీలో వచ్చిన సూపర్ హిట్ సినిమా హంగామా. అక్షయ్ ఖన్న, పరేష్ రావల్, రిమి సేన్ మెయిన్ కాస్ట్ గా వచ్చిన ఈ మూవీ అపట్లో ఒక సంచలనమే సృష్టించింది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడి ఎంటర్టైనర్ రిపీటెడ్ ఆడియన్స్ ని రాబట్టి అప్పట్లోనే 20 కోట్లు రాబట్టింది. స్టార్ హీరోలు లేకుండా ఆరు కోట్లు పెట్టిన హంగామా సినిమా 20 కోట్లు వసూళ్ళు చేసింది అంటే, ఇందులో ఎంత ఫన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇంత పెద్ద హిట్ అయిన సినిమాకి 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. ప్రియదర్శన్ దర్శకత్వంలోనే రానున్న ఈ మూవీలో పరేష్ రావల్, మీజాన్, ప్రణీత నటిస్తుండగా… చాలా రోజుల తర్వాత శిల్పా శెట్టి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తోంది. జూలై 23న ప్రేక్షకుల ముందుకి రానున్న హంగామా 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మూడు నిమిషాల డ్యూరేషన్ తో కట్ చేసిన ట్రైలర్, సినిమా ఎలా ఉండబోతుందో చెప్తూ ఒక మినీ ఫన్ రైడ్ నే చూపించింది. అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది. హంగామా 2 రిలీజ్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి అప్పటివరకూ ట్రైలర్ చూసి నవ్వుకోండి.