‘మహేష్ బాబు’ అక్క పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక నెగిటివ్ పాత్రలో అనిల్ కపూర్, సుదీప్ వంటి స్టార్స్ నటించబోతున్నారని మొన్న ఒక రూమర్ వైరల్ అయ్యింది.

ఇక ఇప్పుడు సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటి విద్యా బాలన్ ని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో కనిపించి తెలుగు జనాలను అమితంగా ఆకట్టుకున్న విద్యా బాలన్ కి ఆ తరువాత టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ దక్కలేదు. ఇక నెక్స్ట్ ఆమె సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కి అక్కగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..