కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన బాలీవుడ్ హీరో?

టాలీవుడ్ హిట్ మూవీ జెర్సీ యొక్క హిందీ రీమేక్ షూటింగ్‌లో ఉన్న షాహిద్ కపూర్, వచ్చే నెలలో మళ్లీ ఈ చిత్రం షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. అయితే కోవిడ్ 19 మహమ్మారి వలన జరిగిన నష్టాలను పరిగణనలోకి తీసుకుని నటుడు తన రెమ్యునరేషన్ లో ఎనిమిది కోట్ల రూపాయలు తగ్గించాడు.
ముందుగా ఒప్పందం ప్రకారం రూ .33 కోట్లు అలాగే లాభాల్లో వాటా కూడా తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు.

అయితే, షాహిద్ ఇప్పుడు ఈ చిత్రాన్ని కొనసాగించడానికి కొత్త రెమ్యునరేషన్ ని అంగీకరించారు. నిర్మాతలు ఇదే డిమాండ్లపై పరస్పరం అంగీకరించారు. బడ్జెట్ లెక్కలు కూడా గణనీయంగా మారిపోయాయి. కాబట్టి నిర్మాతలు తమ లీడ్ స్టార్‌ కొంత వరకు తగ్గిస్తే బెటర్ అని అనుకుంటున్న తరుణంలో షాహిద్ వారికి అండగా నిలిచాడు. తన ఫీజును 8 కోట్ల రూపాయల వరకు తగ్గించడంతో ఇప్పుడు 25 కోట్ల రూపాయలు మాత్రమే అందనున్నాయి. ఇక సినిమా హిట్టయితే లాభాల్లో వాటా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్, అమన్ గిల్, దిల్ రాజు మరియు ఎస్ నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.