Bollywood: ఉత్త‌మ న‌టుడు దివంగ‌త న‌టుడు ఇర్ఫాన్‌.. ఉత్త‌మ న‌టి ఎవ‌రు తెలుసా?

Bollywood: బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌తి సంవ‌త్స‌రం ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తారు. తాజాగా జ‌రిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డు ముంబ‌యిలో జ‌రిగింది. ఈ క్ర‌మంలో బాలీవుడ్ దివంగ‌త ప్ర‌ముఖ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ న‌టించిన అంగ్రేజీ మీడియం చిత్రానికి గానూ ఉత్త‌మ న‌టుడుతో జీవిత సాఫ‌ల్య పుర‌స్కారాలు ఆయ‌న‌కు ద‌క్కాయి.. ఉత్త‌మ న‌టి విభాగంలో థ‌ప్ప‌డ్ సినిమాతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న తాప్సీకి ఉత్త‌మ న‌టి పుర‌స్కారం ల‌భించింది.

Bollywood

అలాగే ఈBollywood చిత్రం ఉత్త‌మ చిత్రంగా ప‌లు విభాగాల్లో పుర‌స్కారాలు సొంతం చేసుకుంది థ‌ప్ప‌డ్ చిత్రం. ఇక ఉత్త‌మ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్‌.. తానాజీ సినిమాకు గాను పుర‌స్కారం ద‌క్కింది. ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు సైఫ్ అలీఖాన్‌(తానాజీ సినిమా), ఉత్త‌మ స‌హాయ న‌టి ఫ‌రూక్ జాఫ‌ర్ (గులాబో సితాబో), అలాగే మ‌హిళా నేప‌థ్యంలో తీసిన దేవి షార్ట్‌ఫిల్మ్ కు ఉత్త‌మ అవార్డ్ ద‌క్కింది. ఇందులో శ్రుతిహాస‌న్‌, కాజోల్‌, నేహా ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లుగా న‌టించారు.. ఈ Bollywood చిత్రానికి ప్రియాంకా బెన‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.