Bollywood drugs case: డ్ర‌గ్స్ కేసులో సుశాంత్ ఫ్రెండ్ అరెస్ట్‌..

Bollywood drugs case: బాలీవుడ్ యంగ్ హీరో దివంగ‌త సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ప‌లు చిత్రాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేసిన రిషికేశ్ ప‌వార్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నిషేధిత డ్ర‌గ్స్ వినియోగిస్తుండ‌డ‌మే గాక‌, వాటిని సేక‌రిస్తున్నట్టు రిషికేష్ ప‌వార్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సుశాంత్‌కు కూడా అత‌డు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి.

Bollywood drugs case ఇదే కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన సుశాంత్ మాజీ స్నేహితురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి కూడా త‌న వాంగ్మూలంలో ప‌వార్ పేరును వెల్ల‌డించిన‌ట్టు తెలిపారు. అలాగే సుశాంత్ ఇంట్లో పనిచేసే దీపేశ్ సావంత్ కూడా విచార‌ణ‌లో రిషికేశ్ పేరును వెల్ల‌డించాడు. దీంతో ఎన్‌సీబీ అధికారులు రిషికేష్ ఇంటిపై దాడిచేసి ల్యాప్‌టాప్‌, హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. Bollywood drugs case ఇక రిషికేష్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలోనే సుశాంత్‌కు స్నేహితుడి అయ్యాడ‌ని స‌మాచారం.