మేడమ్ సార్… మేడమ్ అంతే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ పూజ హెగ్డేని చూస్తూ… ఆమె అందాన్ని పొగుడుతూ మేడమ్ సార్… మేడమ్ అంతే అనే డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్ ని అమ్మాయిలని ఫ్లర్ట్ చేయడానికి వాడిన అబ్బాయిలు ఇప్పుడు ఒక సినిమా పోస్టర్ చూసి చెప్పేస్తున్నారు. సినిమా పోస్టర్ ని చూసి డైలాగ్ చెప్పడం ఏంటనుకుంటున్నారా? అవును బాలీవుడ్ డివా ఊర్వశి రౌటేలా తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా బ్లాక్ రోజ్. డైరెక్టర్ సంపత్ నంది ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రీలుక్ తోనే సెగలు పుట్టించిన మేకర్స్, ఫస్ట్ లుక్ తో అందరినీ ఫిదా అయిపోయేలా చేశారు.

పోస్టర్ లో రెడ్ సారీ కట్టుకున్న ఉర్వశిని చూసిన ప్రతి ఒక్కరూ మేడమ్ సార్… మేడమ్ అంతే అనాల్సిందే. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా కనిపిస్తున్న బ్లాక్ రోజ్ సినిమాకి ఊర్వశి రౌటేలా గ్లామర్ మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంపత్ నంది, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి వెయిట్ చేయండి అని ట్వీట్ చేశాడు. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో తెలియదు కానీ కుర్రాళ్లు ఈ పోస్టర్ ని మాత్రం ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.