Bollywood: కార్తీక్ ఆర్య‌న్ ధ‌మాకా టీజ‌ర్ రిలీజ్‌..

Bollywood: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్, డైరెక్ట‌ర్‌ రామ్ మ‌ధ్వానీ కాంబినేష‌న్‌లో ధ‌మాకా చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో మృణాల్ ఠాకూర్‌, అమృత సుభాష్, వికాస్ కుమార్‌, విశ్వ‌జీత్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో కార్తీక్ న్యూస్ రీడ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈBollywood చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్‌, బాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో ఫిదా చేశాయి.. ఇందులో కార్తీక్ ఎక్కువ జుట్టుతో వైవిధ్య‌మైన లుక్‌లో క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జరుగుతుండ‌గా.. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

Karthik

ఇక తాజాగా ఈBollywood చిత్రానికి సంబంధించి టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.. దీంట్లో కార్తీక్ ఆర్య‌న్‌ న్యూస్ రీడింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓ ఉగ్ర‌వాది బాంబు బెదిరింపు కాల్ వ‌స్తుంది. ఆ త‌ర్వాత వార్తలు చ‌దివేందుకు టెన్ష‌న్‌తో మ‌రోసారి కెమెరా ముందుకు వ‌స్తాడు.. నేను అర్జున్ పాఠ‌క్ భ‌రోసా 247 నుంచి నేను చెప్పేదంతా నిజం అంటూ ఇబ్బంది ప‌డుతూ న్యూస్ రీడింగ్ చేస్తాడు హీరో కార్తీక్‌.. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని రోన్నీ స్ర్కూవ్‌వాలా, అమితా మ‌ధ్వానీ, రామ్ మ‌ధ్వానీ నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లో ఈBollywood చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.