హరి హర వీరమల్లుతో హాట్ బ్యూటీ…

వకీల్ సాబ్ తో జనసేనాని పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఎన్నేళ్లు సినిమాలకి దూరంగా ఉన్నా కూడా పవర్ స్టార్ స్టామినా తగ్గదు అని వకీల్ సాబ్ నిరూపించింది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడితో పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు.“హరి హర వీరమల్లు”గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మోషన్ పోస్టర్ బయటకి వచ్చి పవన్ అభిమానులనే కాదు యావత్ సినీ అభిమానులందరినీ మెప్పించింది. ఈ భారీ పీరియాడిక్ డ్రామాలో పవన్ సరసన హీరోయిన్ గా యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది.

Hari Hara Veera Mallu First Glimpse | Pawan Kalyan | Krish | #HHVM

“హరి హర వీరమల్లు” సినిమాలో గ్లామర్ డోస్ మరింత పెంచుతూ… హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా కలిసింది. ఈ రోల్ పై క్లారిటీ ఇస్తూ జాక్వలిన్ ఓ రాకుమారి పాత్రలో కనిపిస్తానని చెప్పుకొచ్చింది. పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి బాగా ఎగ్జైట్ అవుతున్నట్టు తెలిపైన ఆ బాలీవుడ్ బ్యూటీ, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ తగ్గినా తర్వాత “హరి హర వీరమల్లు” షూట్ మొదలు పెట్టనున్నారని క్లారిటీ ఇచ్చింది. ఈ శ్రీలంకన్ బ్యూటీ జాక్వలిన్, ప్రభాస్ “సాహో” లో ఐటెం సాంగ్ చేసింది.