బాలీవుడ్ నటుడు ‘పరేష్ రావల్’ కు మరో ఉన్నత పదవి!!

సీనియర్ టాలెంటేడ్ యాక్టర్ గా ఎంతగానో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి కొన్ని మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. నటనతో పాటు, ప్రతిభావంతుడైన ఈ నటుడు రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం, పరేష్ అధికార బిజెపి పార్టీ నుండి పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నారు.

అలాగే అహ్మదాబాద్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఇప్పుడు పరేష్ రావల్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు చీఫ్ గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ ప్రముఖులు అలాగే ఇతర బీజేపీ అధినేతలు పరేశ్ రావల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.