కరోనా భారిన పడిన హిందీ యాక్టర్ ‘హిమాన్ష్ కోహ్లీ’!!

ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు హిమాన్ష్ కోహ్లీ కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇటీవల కొంత అస్వస్థతకు గురైన అతను వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ అని తేలింది. అతను వైరస్ బారిన పడిన తరువాత తన కుటుంబ సభ్యులను దూరంగా ఉంచాడు. హిందీ షో హమ్సే హై లైఫ్ ద్వారా ఈ నటుడు మంచి క్రేజ్ అందుకున్నాడు. అతను యారియాన్ సహా కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు.

ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని హిమాన్ష్ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని కోరారు. రాబోయే 2 వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. ఒక వేల. మీకు కరోనా వస్తే దయచేసి నివారణ విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబ సబ్యులకు సోకకుండా క్వారంటైన్ లోనే ఉండండి” అంటూ హిమాన్ష్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే అతను అనుసరిస్తున్న కొన్ని చిట్కాలను కూడా తన ఫాలోవర్స్ కి తెలియజేశాడు.