Pushpa Villain:పుష్పలో విలన్‌గా బాలీవుడ్ నటుడు?

Pushpa Villain: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా పుష్ప. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య-2 సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నాడని గతంలో వార్తలొచ్చాయి.

pushpa villen bollywood actor

కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల డేట్స్ ఎడ్జెట్ కాకపోవడంతో.. విజయ్ సేతుపతి పుష్ప సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.