బిగ్‌బాస్ రన్నర్‌ అఖిల్‌కి బంపర్ ఆఫర్

బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అనేక సినిమా అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్‌కి పలు సినిమా అవకాశాలు రాగా.. సోహైల్ హీరోగా ఒక సినిమా రానుంది. ఇక స్వాతి దీక్షిత్‌కి ఆర్జీవీ సినిమాలో అవకాశం రాగా.. ఇంకా చాలామంది కంటెస్టెంట్లకు అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా అఖిల్‌కి సినిమా అవకాశం వచ్చింది.

bogboss contestent akhil cinema

గోపీచంద్ హీరోగా సిటీమార్ సినిమా రాబోతుంది. ఇందులో అఖిల్‌కి అవకాశం వచ్చినట్లు సమాచారం. సంపత్ నంది ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. అయితే ఇందులో అఖిల్‌కి ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కిందట.స

సెకండాఫ్‌లో అఖిల్ నటిస్తాడని సమాచారం. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.