దర్శకుడు రాజమౌలి తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌పై కొందరు బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ కూడా సినిమాలో కొమురం భీమ్ పాత్రను తప్పుగా చూపిస్తున్నారని ఆరోపించారు. చారిత్రక గిరిజన నాయకుడు కొమరం భీమ్ పాత్రను ఒక ముస్లిం వేషధారణలో చూపించడం కరెక్ట్ కాదని, మేము దీన్ని అంగీకరిస్తామని మీరు అనుకున్నారా? అని దుబ్బాక బహిరంగ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడారు.
సన్నివేశాన్ని తొలగించకపోతే ఘోరమైన పరిణామాలు ఉంటాయని బీజేపీ నాయకుడు హెచ్చరించారు. కొమురం భీమ్ అనే గిరిజన నాయకుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో వివిధ ప్రదేశాలలో దేవుడిగా కొలుస్తారని అన్నారు. అంతకుముందు మరో బీజేపీ ఎంపి, గిరిజన నాయకుడు సోయం బాపురావ్ కూడా ఇదే విధంగా హెచ్చరించి సన్నివేశాన్ని డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. కొమరం భీమ్‌ను ముస్లింగా చిత్రీకరిస్తే థియేటర్లను తగలబెట్టాలని బెదిరించారు. ఇక కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ మొదటి వారంలో తిరిగి ప్రారంభమైంది.