500 పైగా థియేటర్స్ లో జాతిపిత మహాత్మాగాంధీ గారి జీవిత చరిత్ర

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మరియు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ల ఆధ్వర్యంలో తెలంగాణ ఎగ్జిబ్యూటర్ ల సహకారంతో ఈరోజు దాదాపు 500 పైగా థియేటర్స్ లో మార్నింగ్ షో గా విద్యార్థులలో దేశభక్తి పెంపొందించడం కోసం జాతిపిత మహాత్మాగాంధీ గారి జీవిత చరిత్రను ప్రదర్శించడం జరిగినది. ఈ షో కార్యక్రమం 15 రోజులు కొనసాగుతుంది… ఐమాక్స్ థియేటర్ లో షో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, ప్రసాద్ ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ గారు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొత్త బసిరెడ్డి గారు, కార్యదర్శి కె.యల్.దామోదర ప్రసాద్ గారు, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి అనుపమ్ గారు మరియు తదితరులు… జై భారత్… జైజై భారత్ 🇪🇬