బిందుసార” చాప్టర్-1 ఫిల్మ్ టీజర్ విడుదల!!

సత్యమేవ జయతే, 1948 ఫేమ్ దర్శక, నటుడు ఈశ్వర్ బాబు, మానస రెడ్డి, హైమా కె.వీల ముఖ్య పాత్రదారులుగా విశాల్ మంతిన దర్శకత్వంలో మంతిన వెంకట్ రావు నిర్మించిన “బిందుసార” చాప్టర్-1 ఫిల్మ్ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసారు. దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. డిసెంబర్ లో “బిందుసార” ఫిల్మ్ రిలేజ్ కానుంది.

చిత్ర దర్శకుడు విశాల్ మంతిన మాట్లాడుతూ.. భారత్, అమెరికా, ఈజిప్టు నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. దేశ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో “బిందుసార” చాప్టర్-1 చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం టీజర్ ని రిలీజ్ చేసాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందని.. అన్నారు.

ఈశ్వర్ బాబు మాట్లాడుతూ… ఈ చిత్రంలో ఒక ముఖ్య క్యారెక్టర్లో నటించాను. హిస్టరీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తో “బిందుసార” ఫిల్మ్ . అందులో భాగంగా చాప్టర్-1 చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసాం.. ఉత్కంఠ భరితమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన “బిందుసార” చిత్రం డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది..
అన్నారు.

అభిలాష్ అడ్డా, ఉమంత కల్ప, రాయల హరిచంద్ర, ప్రతాప్, భవాని శంకర్, విక్రమ్ ఆదిత్య, అనుషా చౌదరి, సమైరా, ఉమా మహేశ్వర్, తదితరులు ముఖ్యపత్రాల్లో నటించిన ఈ భిందు సార వెబ్ చిత్రానికి సంగీతం: తెరిష్ తేజ, కెమెరా-ఎడిటింగ్: హిమాన్షు గొట్టిపర్తి, మాటలు: రవీణ చవాన్, కేఎస్ఎం నవీన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశాల్ మంతిన, నిర్మాత: మంతిన వెంకట్ రావు.