చెక్ దే ఇండియా సినిమాకి అఫీషియల్ రీమేక్ – బిగిల్

ఇళయదళపతి విజయ్, కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో. విజయ్ సినిమా వస్తుంది అంటే ట్రేడ్ వర్గాలు భారీ లెక్కలే వేసుకుంటాయి. గత కొంత కాలంగా అట్లీతోనే సినిమాలు చేస్తున్న విజయ్ ఇప్పటికే రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చాడు, ముఖ్యంగా మెర్సల్ సినిమాతో ఇండస్ట్రీ హిట్టే ఇచ్చాడు. ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా బిగిల్. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో అనౌన్స్మెంట్ టైం నుంచి బిగిల్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీపావళికి రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుతుండడంతో చిత్ర యూనిట్ బిగిల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

విజయ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా, ఒక రౌడీగా రెండు పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. షారుక్ ఖాన్ నటించిన చెక్ దే ఇండియా సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న బిగిల్ లో హాకీ కథ ఫుట్ బాల్ కథగా మారింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే షారుక్ ఎపిసోడ్ కి చేంజెస్ చేసి కమర్షియలైజ్ చేశారు. అభిమానుల కోసం ఇంకో రఫ్ అండ్ టఫ్ విజయ్ క్యారెక్టర్ పెట్టి డ్యూయల్ రోల్ చేశారు. ట్రైలర్ లో ప్లేయర్ గా, కోచ్ గా కనిపించిన విజయ్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఇంకో పాత్రలో రౌడీగా కనిపించిన విజయ్, తన లుక్ ని చాలా చేంజ్ చేశాడు. మాస్సీగా ఉన్న ఈ లుక్ లో విజయ్ చెప్పిన డైలాగ్స్, చేసిన ఫైట్స్ సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. అయితే ఫుట్ బాల్ ఎపిసోడ్ ని చూపించే క్రమంలో కొన్ని సీన్స్ కి విజువల్ ఎఫెక్ట్స్ సరిగా సెట్ కాలేదు. రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది, నయన్ ట్రైలర్ లో కనిపించింది కాసేపే అయినా కూడా ఆకట్టుకుంది.

ట్రైలర్ మొత్తం విజయ్ చుట్టే తిరగడంతో ఇంకొకరిని చూసే అవకాశం కనిపించలేదు. బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించాడు. కింగ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు అని చెప్పారు కానీ బిగిల్ ట్రైలర్ లో అందుకు సంబంధించిన క్లూస్ ఏమీ ఇవ్వలేదు. మరి సినిమాలో అయినా ఉంటాడో లేదో తెలియదు కానీ బిగిల్ ట్రైలర్ చూసిన తర్వాత షారుక్ ట్వీట్ చేయడం చూస్తుంటే, సినిమాలో క్యామియో ప్లే చేసినట్లే అనిపిస్తుంది. మొత్తానికి హ్యాట్రిక్ కాంబినేషన్ కి కావాల్సిన హైప్ ని బిగిల్ ట్రైలర్ అయితే క్రియేట్ చేసింది, ఇక దీపావళికి టపాసుల మోతమోగడమే మిగిలింది.