రజినీకాంత్ సినిమా తర్వాత విజయ్ సినిమాకే ఆ రికార్డు దక్కింది

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా బిగిల్. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుతుండంతో చిత్ర యూనిట్, ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. బిగిల్ ట్రైలర్ వచ్చిన 24 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ రాబట్టి, 1.66 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో ఏ ట్రైలర్ కి దక్కని రికార్డు బిగిల్ సొంతం చేసుకుంది. ఒక రీజినల్ సినిమా ట్రైలర్ 2 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకోవడం అనేది అతి పెద్ద రికార్డు. మరే హీరో కూడా అందుకోలేని స్థాయిలో నిలిచే ట్రైలర్ ని అందించిన చిత్ర యూనిట్ బిగిల్ సినిమాని తెలుగులో విజిల్ గా రిలీజ్ చేయబోతున్నారు.

bigil non theatrical business

బిగిల్ తెలుగు రైట్స్ ని ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత ఎస్.ఎం. కోనేరు సొంతం చేసుకున్నారు. విజిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, బిగిల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోని సెన్సార్ కి పంపించారు. సెన్సార్ రిపోర్ట్ బయటకి రాకముందే బిగిల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ బయటకి వచ్చి ట్రేడ్ వర్గాలని కూడా ఆశ్చర్యపరుస్తోంది. బిగిల్ సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కలిపి 45 కోట్లకి అమ్ముడుపోయింది. ఒక ప్రముఖ కంపెనీ బిగిల్ కి ఇంత మొత్తం పెట్టి కొనింది. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా బిగిల్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది.