బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి మృతి

ఇండియాలో బిగ్‌బాస్ షో ఎంత పాపులర్ అనేది మనందరికీ తెలిసిందే. అన్ని భాషల్లోనూ ఈ షోకు అత్యధిక రేటింగ్స్‌తో పాటు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇటీవలే తెలుగు బిగ్‌బాస్ 4 ముగియగా… ప్రస్తుతం తమిళంలో బిగ్‌బాస్ సీజన్ 4 నడుస్తోంది. ఇక హిందీలోనూ ప్రస్తుతం బిగ్‌బాస్ షో నడుస్తోంది. తాజాగా తమిళ బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

ANITHA SAMPATH FATHER DIED

తమిళ బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ అనితా సంపత్ తండ్రి RC సంపత్ మృతి చెందారు. ఈ విషయాన్ని అనితా సంపత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ హఠాన్మరణం చెందారు. ఆయన ఇక లేరనే వార్తను తాను ఇంకా నమ్మలేకపోతున్నానని, బిగ్‌బాస్‌లోకి వెళ్లకముందు తన తండ్రిని కలిశానని అనితా సంపత్ తెలిపింది. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి షిరిడీ వెళ్లారని, ఫోన్ కలవకపోవడం వల్ల మాట్లాడలేకపోయానంది.

గుండెపోటుతో తన తండ్రి మరణించలేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. గుండె సమస్యలు ఎలాంటివి లేవని చెప్పింది. అక్టోబర్‌లో మొదలైన తమిళ బిగ్‌బాస్ 4లోకి 16 కంటెస్టెంట్లతో పాటు అనితా సంపత్ అడుగుపెట్టింది. 84 రోజుల తర్వాత గత ఆదివారం అనితా సంపత్ ఎలిమినేట్ అయింది.