బిగ్ బాస్ 4: కొత్త హోస్ట్ ఎంట్రీ.. హాట్ గర్ల్ ఎలిమినెట్!

బిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. గత వారం టాస్క్ లతో కంటెస్టెంట్స్ మరోసారి వారి టాలెంట్ ని బయటపెట్టారు. ఇక ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినెట్ అయ్యేదెవరు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక అందరి చూపు హాట్ బ్యూటీ మోనల్ గజ్జర్ పైనే ఉంది. హౌజ్ లో ట్రయాంగిల్ లవ్ స్టొరీతో ఈ బ్యూటీ ఎంతగా పాపులర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అఖిల్, అబిజిత్ కి తెలియకుండానే శత్రుత్వం పెంచి పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేలా చేసింది. ఇక ఇప్పటికే అబిజిత్ ఆమెను దూరం పెట్టేశాడు. అఖిల్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక మిగతా కంటెస్టెంట్స్ ఆమెతో అవసరం లేదు అన్నట్లుగానే ఉంటున్నారు. ఆడియెన్స్ అయితే చాలా వరకు ఈ సారి మోనాల్ వెళ్లిపోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఓట్లు కూడా తక్కువ వచ్చినట్లు టాక్. దీంతో మోనాల్ ఈ వారం ఎలిమినెట్ కానుందని తెలుస్తోంది. ఇక కొత్త హోస్ట్ గా అక్కినేని వారి కోడలు సమంత ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. శని, ఆది వారాలకు హోస్ట్ గా సమంత రాబోతుందని, ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్‌లో బిజీగా ఉండడం వలన స్వయంగా ఆయనే సమంతను రికమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ మనాలీలో జరుగుతోంది. దీంతో ఆ షూటింగ్‌లో పాల్గొనడానికి నాగార్జున తన టీంతో కలిసి మనాలీకి వెళ్ళారు. అందుకే శని, ఆది వారాలలో బిగ్ బాస్ షోకి కొత్త హోస్ట్ రానున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.