బిగ్ బాస్ యొక్క నాల్గవ సీజన్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. అయితే మునుపటి మూడు సీజన్లతో పోలిస్తే పోటీదారులు అంతగా క్రేజ్ ఉన్నవారేవరు లేరు. ఇక రాబోయే రోజుల్లో షోకి రేటింగ్ పెరగాలని మరింత హైప్‌ను క్రియేట్ చేయాలని మేకర్స్ తగిన ప్రణాళికల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, షో కోసం నిర్వాహకులు పెద్దగా ఖర్చు చేసిందేమీ లేదని అర్ధమవుతోంది.
షోలోకి వచ్చిన వారు చాలా వరకు తక్కువ రెమ్యునరేషన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఆ విషయంలో బిగ్ బాస్ కి భారీ ఆదాయం మిగిలిందనే చెప్పాలి. పెద్ద మొత్తంలో చెల్లించిన ఒక సెలబ్రేటి కూడా లేడు. నాగ్ రెమ్యునరేషన్ అలాగే సెట్లను నిర్మించడం కోసం మాత్రమే ఎక్కువగా ఖర్చయినట్లు సమాచారం. ఇక కరోనా కాలంలో జనాలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒక విధంగా షోలో పెద్ద సెలబ్రెటీలు లేకపోయినా చూస్తారు. ఈ విధంగా తక్కువ ఖర్చుతో బిగ్ బాస్ నిర్వహుకులు యాడ్స్ ద్వారా భారీ లాభాలను అందుకుంటున్నారు. నిజంగా జాక్ పాట్ కొట్టారనే చెప్పాలి.