బిగ్‌బాస్ టైమ్ మారింది

మరో మూడు వారాల్లో బిగ్‌బాస్-4 ముగియనున్న క్రమంలో నిర్వాహకులు తీసుకున్న ఒక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో బిగ్‌బాస్ షో ప్రసారం అయ్యేది. ఇక శనివారం, ఆదివారం నాగార్జున హెస్టింగ్ చేసే ఏపిసోడ్లు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతాయి. అయితే త్వరలో షో ముగియనున్న క్రమంలో షో టైమింగ్స్ మార్చడం చర్చనీయాంశంగా మారింది.

bigboss4

డిసెంబర్ 7 నుంచి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ షోను ప్రసారం చేయాలని స్టార్ మా యాజమాన్యం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక శనివారం, ఆదివారం మాత్రమే యధావిధిగా 9 గంటలకే ప్రసారం చేయనున్నారు. తెలుగు బిగ్‌బాస్‌కు రేటింగ్స్ బాగా వీక్‌గా ఉన్నాయి. నాగార్జున హోస్ట్ చేస్తున్న శని, ఆదివారాల్లో కూడా రేటింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. దీని వల్లనే షో టైమింగ్స్ మార్చాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. రేటింగ్స్, ఎలిమినేషన్ ప్రక్రియ పట్ల నాగార్జున కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. రేటింగ్స్ పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల చూసేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు.

ఇప్పటికే బిగ్‌బాస్-4 85 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఒకరు, వచ్చేవారం ఒకరు ఎలిమినేట్ కానున్నాయి. ఇక మిగిలిన ఐదుగురు ఫైనల్‌లో పోటీ పడనున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో హారిక, అభిజిత్, మోనాల్, అఖిల్, అవినాష్ ఉండగా.. వారిలో అవినాష్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. గత వారమే అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ఎవిక్షన్ పాస్ వల్ల సేవ్ అయ్యాడు. కానీ ఆ వారం అతడు సేవ్ అయ్యే అవకాశాలు లేవు.