Biggboss-4: నాగార్జునను క‌లిసిన బిగ్‌బాస్ ఫేం అఖిల్‌..

Biggboss-4: బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్ అఖిల్ త‌న అమ్మ‌గారితో క‌లిసి అక్కినేని నాగార్జున నివాసానికి వెళ్లారు. ఇటీవ‌లే మ‌రో కంటెస్టెంట్ సోహేల్ అక్కినేని నాగార్జున, చిరంజీవిని క‌లిసిన విష‌యం తెలిసిందే. తాజాగా అఖిల్‌ త‌న త‌ల్లితో క‌లిసి కింగ్ నాగ్ ఇంటికి వెళ్లాడు. దీంతో త‌న త‌ల్లితో క‌లిసి నాగార్జున గారితో దిగిన ఫోటోల‌ను అఖిల్ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. నాగార్జున గారిని మ‌రోసారి క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని..

ఆయ‌న నుంచి ఎంతో నేర్చుకున్నాను.. Biggboss-4 బిగ్‌బాస్ రోజుల్ని ఇంకా మ‌రిచిపోలేక‌పోతున్నా.. ల‌వ్ యూ స‌ర్ మీ టైమ్ మాతో గ‌డిపినందుకు థ్యాంక్స్ అంటూ రాసుకొచ్చాడు అఖిల్‌. ఇక ప్ర‌స్తుతం నాగార్జున బంగార్రాజు చిత్రంలో న‌టిస్తున్నాడు.. అలాగే ఆయ‌న న‌టించిన తాజా చిత్రం వైల్డ్‌డాగ్ షూటింగ్ ఇటీవ‌లే పూర్తి చేసుకుంది.. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.