బిగ్‌బాస్ కంటెస్టెంట్ మృతి

హిందీ బిగ్‌బాస్-10 కంటెస్టెంట్ స్వామి ఓం ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తాజాగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అర్జున్ జైన్ ప్రకటించారు. మూడు నెలల క్రితం ఈయన కరోనా బారిన కూడా పడ్డారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.

swami om passes away

తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న స్వామి ఓం.. బిగ్‌బాస్ 10లో వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్లపై ఆయన మూత్ర విసర్జన చేయడం పెద్ద వివాదాస్పదంగా మారిది. దీంతో ఆయనను హౌస్ నుంచి బహిష్కరించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు.