BIGB: అమితాబ్‌కు శ‌స్త్రచికిత్స‌.. స్వ‌యంగా తానే ట్వీట్‌.. ఫ్యాన్స్ క‌ల‌వ‌రం!

BIGB: బాలీవుడ్ లెజండ‌రీ బిగ్‌బీ అమితాబ్‌బ‌చ్చ‌న్ త‌న ఆరోగ్యంపై అభిమానులు క‌ల‌వ‌ర‌పాటు ప‌డుతున్నారు. స్వ‌యంగా అమితాబ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతూ.. శ‌స్త్రచికిత్స అంటూ రాసుకొచ్చారు.. ఆరోగ్యం..శ‌స్త్రచికిత్స‌..ఏంచెప్పాలి? అని శ‌నివారం రాత్రి త‌న ఆరోగ్య వివ‌రాలు BIGBత‌న అభిమానుల‌తో పంచుకున్నారు. కానీ ఆయ‌న శ‌స్త్రచికిత్స చేయించుకున్నారా? చేయించుకోబోతున్నారా? అన్న‌ది మాత్రం స్ప‌ష్టంగా వెల్ల‌డించ‌లేదు.

amithabbachan

కాగా.. BIGB బిగ్‌బీ చేసిన ట్వీట్‌పై అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు. క‌ల‌కాలం ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం BIGB ఆయ‌న అజ‌య్‌దేవ్‌గ‌ణ్‌తో క‌లిసి మేడే అనే సినిమా చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర షూటింగ్‌లో దిగిన ఫోటోను ఆయ‌న అభిమానుల‌తో పంచుకున్నారు.