‘NTRNeel’ చిత్రం నుండి బిగ్ అప్డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మావెరిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి NTRNeel అని వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అంచనాలు ఆకాశంన్నంటేశాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది.

ఈ మూవీ సెట్స్‌లోకి NTR ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 22 నుంచి సెట్స్‌లోకి ఎన్టీఆర్ అడుగు పెడుతున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ మీద దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించబోతోన్నారు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం మరియు ఇతర భాషలలో విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ చిత్రాలను అందిస్తూ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రశాంత్ నీల్, ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్‌‌ను మరింత పెంచేలా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫర్‌గా, రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా చలపతి వర్క్ చేస్తున్నారు.

నటీనటులు: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

సాంకేతిక బృందం:
బ్యానర్లు : మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
నిర్మాతలు  :  కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు
రచన, దర్శకత్వం  : ప్రశాంత్ నీల్
ప్రొడక్షన్ డిజైన్ :  చలపతి
DOP  :  భువన్ గౌడ
సంగీతం  :  రవి బస్రూర్
పీఆర్వో  : వంశీ కాకా