ప్రభాస్ రామాయనంలో బిగ్ బాస్ స్టార్

పాన్ ఇండియా స్టార్… బాక్సాఫీస్ బాహుబలి… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్. తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ సినిమాలో ప్రభాస్ రాముడిలా నటించనుండగా, సైఫ్ రావణుడిగా కనిపించనున్నాడు. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ లో సీతగా కృతి సనన్ నటిస్తోంది. అయితే రావణుడి తమ్ముడి మేఘనాధుడు పాత్రలో హిందీ బిగ్‌బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా నటించబోతున్నారని బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ సిద్దార్థ్ శుక్ల నటించడం ఖాయంగానే కనిపిస్తోంది. 2019లో జరిగిన బిగ్ బాస్ 13 హిందీలో పార్టిసిపేట్ చేసిన సిద్దార్థ్, 20 వారాల పాటు టాప్ లోనే ఉండి బిగ్ బాస్ టైటిల్ ని సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంత క్లీన్ సపోర్ట్ తో గెలిచిన వారు ఇంకొకరు లేరేమో. ప్రస్తుతం బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తున్న సిద్దార్థ్ శుక్లకి ఆది పురుష్ లో అవకాశం రావడం అనేది చాలా పెద్ద విషయమే.