గ్లామర్ హద్దులు పూర్తిగా చెరిపేస్తున్న తెలుగు పిల్ల…

సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు పెద్దగా ఉండవు, ఎందుకు అని ఎవరినీ అడిగిన మన వాళ్లకి కాస్త గ్లామర్ అడ్డంకులు ఉంటాయనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాస్త ఈ మాటని చెరిపేస్తూ ఈషా రెబ్బ, శోభిత దూళిపాళ్ల, ప్రియాంక జవాల్కర్ లాంటి వాళ్లు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. పాత్ర డిమాండ్ మేరకు గ్లామర్ గా కనిపించడానికి కూడా ఈ హీరోయిన్స్ వెనకాడట్లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో తెలుగు అమ్మాయి నందిని రాయ్ కూడా చేరింది. తెలుగులో ఇప్పటి వరకూ ఆరు సినిమాల్లో నటించిన నందిని రాయ్, నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ షోకి వెళ్లి మంచి ఫేమ్ తెచ్చుకుంది.

nandini rai

రీచబిలిటీ పెరగడంతో నందిని రాయ్ కి సినిమాలు కూడా తీసుకురాని పేరు బిగ్ బాస్ షో తెచ్చింది. ఈ షోతో వచ్చిన పాపులారిటీని కాష్ చేసుకోని సినిమాల్లో బిజీ అవ్వాలన్న నందిని రాయ్ కి, పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో గ్లామర్ హద్దులు చెరిపేసిన నందిని రాయ్, సోషల్ మీడియాని తెగ వాడేస్తోంది. ఇన్స్టాలో రోజుకో కొత్త ఫోటో పెడుతూ నెటిజెన్స్ ని అలరిస్తున్న నందిని రాయ్ కి హీరోయిన్ గా అవకాశం ఇచ్చే దర్శక నిర్మాతలెవరో చూడాలి.