రష్మిక నడుము గురించి హాట్ కామెంట్ చేసిన నితిన్…

బాగా గ్యాప్ తర్వాత తెరపై కనిపించడానికి రెడీ అయిన నితిన్, రష్మికతో కలిసి భీష్మగా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇప్పటివరకూ పోస్టర్స్ తో అలరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియోని రిలీజ్ చేశారు. సాఫ్ట్ వెర్ ఆఫీస్ లో రష్మిక ముందు నడుస్తూ ఉంటే, ఆమె నడుము అందాలని ఆస్వాదిస్తూ ఫాలో అవుతుండగా… రష్మిక వెనక్కి తిరిగింది, దీంతో నితిన్ చేతులు రష్మిక నడుముపై పడ్డాయి… ‘నడుముకుడా విజయ్ మాల్యా లాంటిదిరా…, కనిపిస్తుంటది కానీ క్యాచ్ చేయలేమ్’ అని నితిన్ చెప్పిన డైలాగ్ తో మొదలైన గ్లిమ్ప్స్ చాలా బాగుంది. గీతగోవిందం సినిమాని మరిపిస్తూ శారీలో రష్మిక బ్యూటిఫుల్ గా ఉంది. నితిన్ అండ్ రష్మిక ఆన్ స్క్రీన్ పెయిర్ క్యూట్ గా ఉంది. చలో సినిమాతో అందరినీ నవ్వించిన వెంకీ కుడుముల భీష్మ గ్లిమ్ప్స్ తోనే ఆ ఔట్పుట్ తీసుకురావడంలో సక్సస్ అయ్యాడు.

రష్మిక అందానికి, వీడియో చివరిలో నితిన్ చించేశావ్ అనే రేంజులో కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన వాళ్లందరూ భీష్మ ఫస్ట్ గ్లిమ్ప్స్ చించేశారు అనే ఫీడ్ బ్యాక్ ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్ప్స్ లోనే భీష్మ సినిమాని ఏడాది ఫిబ్రవరి 21న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది, ఈలోపు టీజర్ ట్రైలర్ లు ఎలాగూ వస్తాయి కానీ అప్పటి వరకూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫస్ట్ గ్లిమ్ప్స్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.