ఓటిటిలో స్ట్రీమ్ కానున్న “భజే వాయు వేగం” – ఏ ప్లాటుఫామ్లో రానుందో తెలుసా?

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా గత నెల 31న థియేటర్స్ లో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీ లవర్స్ ముందుకు వచ్చేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో “భజే వాయు వేగం” సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – థియేటర్స్ లో మా “భజే వాయు వేగం” సినిమాకు ప్రేక్షకులంతా తమ ప్రేమను అందించారు. అదే ప్రేమను మేము నెట్ ఫ్లిక్స్ ద్వారా మీ ఇంటికే వచ్చి తిరిగి ఇవ్వబోతున్నాం. అని ట్వీట్ చేశారు.

“భజే వాయు వేగం” సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. థియేటర్స్ లో అందుకున్న విజయానికి మించిన సక్సెస్ నెట్ ఫ్లిక్స్ లోనూ “భజే వాయు వేగం” అందుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు : కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్ :
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) – రధన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు