‘భగత్ సింగ్ నగర్’ చిత్రం నుండి ‘యుగ యుగమైన తరగని వేదన’ పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ !!

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ ,ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం “భగత్ సింగ్ నగర్” . తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా లోని యుగ యుగమైన తరగని వేదన’ పాటను చిత్ర యూనిట్  విడుదల చేశారు 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు మాట్లాడుతూ … ఇంతకు ముందు మేము విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్ర యూనిట్ సమక్షంలో ఈ పాటను విడుదల చేస్తున్నాము. ప్రొడ్యూసర్ గా నాకు ఇంత మంచి టీమ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గానీ ఆర్టిస్టులు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ లో కమిట్మెంట్ ప్రకారంగా చాలా ఇంట్రెస్ట్ తో ఈ సినిమా చేశారు. నేను లండన్ ఉన్న కూడా  నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ నాకు తెలియజేస్తున్న దర్శకుడికి నా ధన్యవాదాలు. ఇంతకుముందు మేము చేసిన పాట లాగే ఈ ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.

చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ … ఇండస్ట్రీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఏంతో ఆవసరం.మా లాంటి కొత్తవారికి అవకాశం కల్పించే నిర్మాత దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఏది అడిగినా కాదనకుండా తెలుసుకుని వెంటనే మాకు కావలసిన ఏర్పాట్లు చేసేవారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. త్వరలో ఈ నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :


విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.

సాంకేతిక నిపుణులు :
ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,
ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్,
స్టిల్స్ : మునిచంద్ర,
నృత్యం : ప్రేమ్-గోపి,
నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,
ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,
కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.
పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.