బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న బెల్లంకొండ శ్రీనివాస్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను హిందీలోకి రీమేక్ చేసేందుకు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

bellamkonda srinivas

తెలుగులో రిలీజ్ అయ్యే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లలో విడుదల చేస్తూ ఉంటారు. గతంలో అలా విడుదలైన చాలా సినిమాలు రికార్డు వ్యూస్‌ను సాధించడంతో బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిందీ ప్రేక్షకుల్లో కూడా ఆదరణ ఉన్నట్లు అర్థమవుతోంది.

ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో శ్రీనివాస్ నటిస్తుండగా… ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఛత్రపతి రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా 2005లో విడుదలైంది. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఆ సినిమా హిందీలోకి రీమేక్ కాబోతోంది.