కాజల్ అగర్వాల్ పెళ్లిపై బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్

కాజల్ అగర్వాల్ ఈ నెల 30న ముంబైలోని తన ఇంట్లోనే అతితక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతోంది. కాబోయే భర్త గౌతమ్ కిచ్లు గురించి కూడా అందరికి ఒక వివరణ ఇచ్చిన కాజల్ ఇక పెళ్లికి ఎవరెవరిని పిలవబోతున్నారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఎన్ని పనులు ఉన్నా కూడా తాను మాత్రం అస్సలు మిస్ కాలేను అంటూ యువ హీరో బెల్లంకొండ చెబుతున్నాడు.
ఇదివరకే పెళ్లి విషయం చెప్పినప్పుడు కాజల్ కి బెస్ట్ విషెస్ అందించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు పెళ్లికి వెళుతున్నట్లు కూడా చెప్పేశాడు. వీరిద్దరు సీత, కవచం సినిమాలో జోడిగా నటించిన విషయం తెలిసిందే. ఇక కాజల్ తనకు మంచి స్నేహితురాలు అంటూ తను నా ఇంట్లో మనిషని చెప్పాడు. ఇక ఆమెకు కాబోయే భర్త గౌతమ్ కూడా మంచి మనసున్న వ్యక్తి అని చెబుతూ.. పెళ్లికి నేను తప్పకుండా హాజరవుతానని బెల్లంకొండ శ్రీనివాస్ ఓపెన్ గా క్లారిటీ ఇచ్చేశాడు.