సాయి శ్రీనివాస్ యాక్షన్ ధమాకా…

కొద్దిరోజుల క్రితమే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడి గా మారబోతున్నాడు అనే వార్త సినీ వర్గాల్లో హల్ చల్ అయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.ఫైట్ మాస్టర్ గా పీటర్ పారితోషికం చాలా ఎక్కువ. అంతే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని వుడ్స్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉండే టెక్నీషియన్. ఇంత బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి.. పీటర్ హెయిన్స్ దర్శకుడి గా మారుతున్నాడు. తను రాసుకున్న స్క్రిప్ట్ ను ప్రొడ్యూసర్ నల్లమలపు బుజ్జి ని అప్రోచ్ అయ్యాడు. బుజ్జి కి కూడా కథ నచ్చడం తో వెంటనే సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నాడట.

పీటర్ హెయిన్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను తీసుకోబోతున్నారట. ఈ స్టార్ ఫైట్ మాస్టర్ ఇప్పటికే శ్రీనివాస్ ని కలిసి కథని చెప్పారట. అయితే బెల్లంకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా ఉండటంతో… వచ్చే ఏడాది జూన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్ తన కమిట్మెంట్స్ పూర్తి చేసుకోని ఫ్రీ అయ్యే లోపు సినిమాకి సంబంధించిన కాస్టింగ్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ని పీటర్ కంప్లీట్ చేయబోతున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.