అదుర్స్ అనిపించడానికి రెడీ అవుతున్న అల్లుడు

అల్లుడు అదుర్స్ సినిమాతో సాలిడ్ డెబ్యూ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరోసారి అదే టైటిల్ తో కమర్షియల్ హిట్ అందుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో కెరీర్ కష్టాలు ఫేస్ చేసిన సాయి శ్రీనివాస్, రాక్షసుడు మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. తమిళ్ రీమేక్ గా వచ్చిన రాక్షసుడు, సాయి శ్రీనివాస్ కి అవసరమైన హిట్ ఇచ్చింది. ఈ ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమాని అనౌన్స్ చేశాడు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలయ్యింది కానీ కరోనా కారణంగా బ్రేక్ పడింది.

అన్ లాక్ ఫేజ్ స్టార్ట్ అవ్వడంతో అల్లుడు అదుర్స్ షూటింగ్ ని మళ్ళీ మొదలుపెడుతూ చిత్ర యూనిట్ సెట్స్ పైకి వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా అనౌన్స్ చేస్తూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఫోటోని పోస్ట్ చేసి ట్వీట్ చేశాడు. ప్రభుత్వ సేఫ్టీ మెజర్స్ ని పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు చూసుకుంటూ అల్లుడు అదుర్స్ ని షూట్ చేస్తున్నారు.