రాధేశ్యామ్ మోషన్ పోస్టర్.. అంచనాలను మరింత పెంచేశారు

టాలీవుడ్ రెబల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్ అభిమానులకు ఒక సరికొత్త కిక్కిచ్చింది. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోషన్ పోస్టర్ ని విడుదల చేసి సినిమాపై ఉన్న హైప్ ని మరింత పెంచేశారనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక వైవిధ్యమైన ప్రేమకథతో రాబోతున్నట్లు అందరికి ఒక క్లారిటీ ఇచ్చేశారు.

ఇక సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఐదు భాషల్లో సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. కృష్ణ కృష్ణ మన మోహనా… చిత్త చోర రాధా జీవన… మేఘ శ్యామ మధుసూధనా … రాధే శ్యామ ఎదు నందనా… అంటూ సాగే ఆ లిరిక్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మరి దర్శకుడు రాధాకృష్ణ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక యూవీ క్రియేషన్స్, అలాగే గోపికృష్ణ బ్యానర్లలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లోనే వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు.