బట్టలరామ స్వామి బయోపిక్కు చూసి నవ్వుకోండి

ప్రస్తుతం టాలీవుడ్ లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకి మంచి గుర్తింపు లభిస్తుంది. లో, మీడియమ్ సినిమాలకి ఆడియన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి మరో చిన్న సినిమా రెడీ అయ్యింది. అదే గ్రామీణ కథా నేపథ్యంతో వచ్చిన రొమాంటిక్, కామెడీ చిత్రం బట్టల రామస్వామి బయోపిక్కు. రామ్ నారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి ఫన్ రైడ్ ని తలపించింది. ట్రైలర్ తోనే సినీ అభిమానుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. కాసేపు సరదాగా నవ్వుకుందాం, హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్లు ఈ కామన్ మ్యాన్ బయోపిక్ చూసి ఎంజాయ్ చేయండి.