Tollywood: ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ టీజర్ రిలీజ్

Tollywood: అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. నూతన నటీ నటులతో.. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఐ, రామ కృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ Tollywoodసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Battala Ramaswamy teaser

కాగా ఈ Tollywoodసినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంటుంది. జీవిత చరిత్రలు పెద్ద నాయకులు, సినిమా యాక్టర్లకే కాదు సామాన్య మనుషులకు కూడా ఉంటాయి అంటూ మొదలైన టీజర్ లో ఒక్కోపాత్రను పరిచయం చేశారు. జయప్రదగా కిరాకాభినేత్రి శాంతిరావు, జయసుధగా నట పఠాకా లావణ్య రెడ్డి, శ్రీదేవిగా అభినవ నట కంచు సాత్విక, బట్టల రామస్వామిగా నట దురంధర ఆల్తాఫ్ హాసన్ నటిస్తున్నాడు అంటూ వారి పాత్రలు సినిమాలో ఎలా ఉంటాయో చూపించారు. తీసే వాడు ఉండాలే కానీ ప్రతివాడి బతుకూ ఒక బయోపిక్కే అన్న డైలాగ్ బాగుంది. ప్రతి కథలోనూ ట్విస్ట్ లు ఉంటాయి కానీ బట్టల రామస్వామి విషయానికి వచ్చేసరికి ట్విస్టుల్లోనే కథ ఉంటుందన్న డైలాగ్ తో కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని అర్ధమవుతుంది. త్వరలోనే ఈ సినిమాను రిలీజే చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆల్తాఫ్ హాసన్, శాంతి రావ్, సాత్విక జై, లావణ్యరెడ్డి, భద్ర, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈసినిమాకు కథ: రామ్ నారాయణ్, వాసుదేవ్ మూర్తి, స్క్రీన్ ప్లే, మ్యూజిక్: రామ్ నారాయణ్, నిర్మాతలు: సతీష్ కుమార్ ఐ, రామ కృష్ణ వీరపనేని, ప్రొడక్షన్ బ్యానర్: సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్, మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, ఎడిటర్,వీఎఫ్ఎక్స్: సాగర్ దడి, డైలాగ్స్,లిరిక్స్: వాసుదేవ్ మూర్తి, సినిమాటోగ్రఫి: పీఎస్కే మణి, ఆర్ట్ డైరెక్టర్: ఉపేంద్ర రెడ్డి, కొరియాగ్రాఫర్: హరి తాటిపల్లి, కాస్ట్యూమ్స్: మాన్వి గౌతమ్.