Tollywood: మహాశివరాత్రి సందర్భంగా ”బ్యాచ్” చిత్ర ఫస్ట్ లుక్..

Tollywood: ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ లో బేబీ ఆరాధ్య సమర్పణలో తెరకెక్కిన సినిమా “బ్యాచ్” సాత్విక్ వర్మ, నేహా పటాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో కాలకేయ ప్రభాకర్, వినోద్ కుమార్, చిన్నా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్స్, బైక్ దొంగతనాల నేపథ్యంలో కాలేజ్ బ్యాక్డ్రాప్ లో వస్తోన్న లవ్ కమ్ థ్రిల్లర్ మూవీ “బ్యాచ్”. శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేశారు Tollywood చిత్ర యూనిట్.

Batch Movie

ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను రమేష్ గనమజ్జి, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టీజర్, ట్రైలర్ తో పాటు సాంగ్స్ ను మూవీ యూనిట్ విడుదల చేస్తామని దర్శక. నిర్మాతలు తెలిపారు. నటీనటులు: సాత్విక్ వర్మ, నేహా పటాన్, కాలకేయ ప్రభాకర్, వినోద్ కుమార్, చిన్న, మిర్చి మాధవి, సంధ్య జనక్ తదితరులు న‌టించిన Tollywood చిత్రానికి సాంకేతిక నిపుణులు: సంగీతం: రఘు కుంచె, ఎడిటర్: జే.పి, కెమెరామెన్: వెంకట్ మన్నం, నిర్మాతలు: రమేష్ గనమజ్జి, బీరం సుధాకర్, దర్శకత్వం: శివ, పిఆర్ఓ: లక్ష్మీ నివాస్.