బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మరో ముందు అడుగు…

నందమూరి బసవ తరకమ్మకి క్యాన్సర్ వచ్చి మరణించడంతో ఆ పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అనే ఆలోచన నుంచి పుట్టిన ఆసుపత్రి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్. క్యాన్సర్ రోగులకు సేవలు అందించే ఈ హాస్పిటల్, ఇటివలే నీతి అయోగ్ లో స్థానం సంపాదించింది. ఇప్పుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మరో ముందడుగు వేసింది. బుధవారం ఒకటో నంబర్ బ్లాక్ సెల్లార్‌లో కొత్త డే-కేర్ యూనిట్ 3ని హాస్పిటల్ కమిటీ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కిమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్స్‌కు సేవలు అందించడంలో తమ సంస్థ మరో మైలు రాయిని అధిగమించిందని ఆయన అన్నారు. తమ ప్రయాణంలో నిరంతరం సేవలను మెరుగుపరుచుకుంటూ, మరిన్ని సౌకర్యాలను పేషెంట్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తూ, నూతన వైద్య విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నామని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మ్యానేజింగ్ డైరెక్టర్, స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు.