‘భారతీయుడు-2’ ఆగిపోయినట్లే?

కమల్‌హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ తర్వాత ప్రారంభం కావాల్సిన దీని షూటింగ్ ఇప్పటివరకు మొదలవ్వలేదు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ అనే సినిమాలో ప్రస్తుతం కమల్ నటిస్తున్నాడు. ఇక కేజీఎఫ్ హీరో యశ్-విజయ్ సేతుపతితో భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

KAMALHAASAN

వచ్చే సంవత్సరం జనవరిలో ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రీఫ్ట్ వర్క్‌లో శంకర్ బిజీగా ఉండగా… విక్రమ్ సినిమాతో కమల్ బిజీగా ఉన్నాడు. దీంతో వీరిద్దరు కాంబోలో తెరకెక్కాల్సిన భారతీయుడు-2 సినిమా ఆగిపోయినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

తన కూతురు అదితి శంకర్ మ్యారేజ్ పనుల్లో శంకర్ బిజీగా ఉండటం వల్లనే భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయిందని కొంతమంది చెబుతున్నారు. అయితే గతంలో భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం వల్ల నిర్మాతలకు నష్టం జరిగింది. దాంతో బడ్జెట్‌ను తగ్గించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు టాక్.