ఆసక్తికరంగా ‘భలేగుంది బాలా’ సాంగ్

హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని ‘భలేగుంది బాలా’ అనే పాట టీజర్‌ను తాజాగా హీరో శర్వానంద్ తన సోషల్ మీడియాలో విడుదల చేశాడు. హీరోయిన్ షూట్‌కేస్ పట్టుకుని వెళుతుండగా.. శర్వానంద్ లుంగీలో కనిపిస్తూ ఈ పాట పాడుతున్నట్లు టీజర్‌లో ఉంది. ప్రసిద్ధ రాయలసీమ జానపద కళాకారుడు పెంచల్ దాస్ ( Penchal das ) రాసి, పాడిన ఈ పాటకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు.

ఈ పాట రిలీక్స్ చాలా బాగున్నాయి. దీంతో ఫుల్ సాంగ్ కోసం అభిమానులు వేచిచూస్తున్నారు. త్వరలో ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఇది శర్వానంద్ 30వ సినిమా కాగా.. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది.

శ్రీకారం సినిమాలో రైతు పాత్రలో శర్వానంద్ నటిస్తుండగా.. ఈ సినిమాతో కిషోర్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.