Uppena: ఫ్యామిలీతో క‌లిసి ఉప్పెన చిత్రం చూసిన బాల‌య్య‌..

Uppena: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఈరోజు హైద‌రాబాద్‌లో ఉప్పెన చిత్రాన్ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీక్షించారు. సినిమా చాలా బాగుంద‌ని.. ఈ చిత్రంలో న‌టీన‌టులు, ద‌ర్శ‌కుడు, ఇత‌ర సాంకేతిక నిపుణులు, నిర్మాత‌ల‌ను అభినందించారు. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ న‌ట‌న ఎంతో బాగుంది.. Uppenaమొద‌టి చిత్రం అయినా స్టార్ హీరోలా త‌న న‌ట‌నను ప్ర‌ద‌ర్శించాడు. అలాగే దీంట్లో హీరోయిన్ కృతిశెట్టి కూడా త‌న అందంతో పాటు త‌న హావాభావాల‌తో కుర్ర‌కారును క‌ట్టిప‌డేసింది.

balakrishna

మ‌రీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే Uppenaఈ చిత్రంలో ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ మ‌క్కల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి చేసిన విల‌న్‌పాత్ర‌కు ప్రేక్ష‌కులు ఉప్పెన చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అంత‌లా ఆయ‌న న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ Uppenaచిత్రంతో డైరెక్ట‌ర్‌గా అవ‌తార‌మెత్తిన బుచ్చిబాబు సానా త‌న ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌లోకి మ‌రోసారి ర‌ప్పించేలా చేశారు. ఈ నెల 12న రిలీజ్ అయినా ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు కూడా ఈUppena చిత్రం హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌గా.. దేవీశ్రీ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందించారు. ఈ Uppenaసినిమాలో పాట‌లు గాని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేసింది.