అభిమానితో కూర్చుని అల్పాహారం చేస్తున్న ‘బాలయ్య’

నందమూరి బాలకృష్ణ ఏది మాట్లాడినా కూడా మనసులో అనుకున్నదే బయటకు వస్తుందనేది అందరికి తెలిసిన విషయమే. మనసులో దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడే బాలయ్య ఎలాంటి విషయంపైనా డేరింగ్ గా స్పందిస్తారు. ఇక అభిమానులను ఎలా ఆదరించాలో అనే విషయం కూడా ఆయనకు బాగా తెలుసు.

అదే విధంగా తప్పు చేస్తే కూడా ఆయన హెచ్చరిస్తూ ఉంటారు. అదే విధంగా పద్దతిగా ఉంటే పక్కన పెట్టుకుంటాడని బలయ్య సన్నిహితులు చెప్పే మాట. ఇక రీసెంట్ గా ఒక అభిమాని ఆయనను పర్సనల్ గా కలవడానికి రాగానే ముందు టిఫిన్ చేసి మాట్లాడుకుందాం అని అతనితో కలిసి టిఫిన్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో బోయపాటి దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే