ఘర్జించడానికి సిద్దం అవుతున్న అఖండ

సింహా, లెజెండ్ తర్వాత మళ్లీ బాలయ్య బోయపాటి కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ అఖండ. భారి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. టీజర్ 50 మిలియన్ వ్యూస్ రాబట్టడమే ఇందుకు ఉదాహరణ. బాలయ్య మాస్ డైలాగ్స్ చెప్తుంటే యుట్యూబ్ రికార్డ్స్ షేక్ అయ్యాయి. అఘోరాగా బాలయ్య లుక్ కి నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు. అఖండ సినిమాతో బాలకృష్ణ సాలిడ్ కంబాక్ ఇవ్వడం గ్యారెంటి అని డిసైడ్ అయిపోయారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా డిలే అయిన ఈ ప్రాజెక్ట్ కోసం ఇండస్ట్రీ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Akhanda | #BB3 Title Roar | Nandamuri Balakrishna | Boyapati Srinu | Thaman S | Dwaraka Creations

ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇంకా రెండు వారాల బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేయడానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ప్రగ్యా, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని, థర్డ్ వేవ్ అనే మాట లేకపోతే అన్ని పనులు కంప్లీట్ చేసి మేకర్స్ అఖండని వినాయక చవితి పండగ సందర్భంగా సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే బాలయ్య అభిమానులు వినాయక చవితి దసరా పండుగలని కలిపే సెలెబ్రేట్ చేసుకోవడం గ్యారెంటి.