Tollywood: నేడు భీష్మ ఏకాదశి.. తాను పోషించిన భీష్మ పాత్ర స్టిల్స్ ను రిలీజ్‌ చేసిన బాల‌య్య‌!

Tollywood: నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..”భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు.

ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను అన్నారు బాల‌కృష్ణ‌.