మెలేసిన మీసంతో… లీకైన బాలయ్య ‘BB3’లుక్..

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య చేస్తున్న ‘BB3’ సినిమాకు సంబంధించిన ఒక లుక్ సోషల్ మీడియాలో లీకైంది. ఈ లుక్‌లో లుంగీ, వైట్ షర్ట్‌లో బాలయ్య కనిపించాడు. మెలితిరిగిన మీసంతో చేతికి వాచ్ పెట్టుకుని మాస్ లుక్‌లో బాలయ్య చాలా స్ట్రైలిష్‌గా ఉన్నాడు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో BB3 షూటింగ్ మొదలైంది. బాలయ్య 106వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది.

BALAKRISHNA

షూటింగ్‌లో ఉన్న బాలయ్యను కొంతమంది తెలంగాణ తెలుగు యువత నాయకులు కలిశారు. తెలంగాణ తెలుగు యువత ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా బాలయ్యను ఆహ్వానించారు. బాలయ్య చేతుల మీదుగా తెలంగాణ తెలుగు యువత లోగోను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య షూటింగ్‌లో ఉండటంతో సినిమాలోని ఒక లుక్‌తో కనిపించాడు.

దీనిని ఫొటో తీసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాలయ్య లుక్ వైరల్‌గా మారింది. ఈ లుక్‌లో బాలయ్య సూపర్బ్‌గా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.