మరోసారి బాలయ్య, చిరు మధ్య వార్?

టాలీవుడ్‌లో సీనియర్ హీరోలైన నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. మధ్యలో చిరంజీవి పాలిటిక్స్‌లోకి వెళ్లి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు చేయలేదు. కానీ బాలయ్య మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలయ్య సినిమాలు విడుదల అవుతున్నాయంటే.. సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఒకేసారి వీరిద్దరి సినిమాలు విడుదలైతే.. బాక్సాఫీస్ వద్ద యుద్ధం రసవత్తరంగా ఉంటుంది.

BALAYYA AND CHIRU

గతంలో అనేకసార్లు బాలయ్య, చిరంజీవి సినిమాలు ఒకేసారి విడుదలవ్వగా… ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద ఈ సీనియర్ హీరోలు పోరుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మే 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో రానున్న సినిమా కూడా మే నెలలో విడుదల కానుందని సమాచారం. ఇదే జరిగితే సమ్మర్‌లో ఈ అగ్రహీరోల మధ్య పోరు ఎలా ఉంటుందో చూడాలి.