ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలమిత్ర’…”ఊర్వశి ఓటిటి” లో విడుదల!!

 సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టర్నడ్ డైరెక్టర్ శైలేష్ తివారి స్వీయ దర్శకత్వంలో.. బొద్దుల లక్ష్మణ్ తో కలిసి నిర్మించిన మర్డర్ మిస్టరీ డ్రామా 'బాలమిత్ర'. స్వర్గీయ బొద్దుల నారాయణ దివ్యాశీస్సులతో... శ్రీ సాయిబాలాజీ ఫిల్మ్స్-వి.ఎస్.అసోసియేట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రంలో.. రంగ, శశికళ, కీయారెడ్డి, దయానంద్ ముఖ్యపాత్రలు పోషించారు.

 దర్శకనిర్మాత శైలేష్ తివారి స్వయంగా కథ-స్క్రీన్ ప్లే సమకూర్చుకున్న ఈ చిత్రం గత నెల విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులనూ విశేషంగా అలరించడంతోపాటు... విమర్శకుల ప్రశంసలు సైతం దండిగా అందుకుంది. ఈ చిత్ర విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో... శైలేష్ తివారి తన తదుపరి చిత్రం తెరకెక్కించే అవకాశం దక్కించుకోవడం విశేషం.

 కాగా ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను ఆలరించేందుకు "ఊర్వశి ఓటిటి" లో మే 1 నుంచి ప్రసారం కానుంది. దర్శకనిర్మాత శైలేష్ తివారి మాట్లాడుతూ..."నిర్మాతగా 'జేబు శాటిస్పేక్షన్'... దర్శకుడిగా 'జాబ్ శాటిస్ఫేక్షన్' ఇచ్చిన "బాలమిత్ర" ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ఆడియన్స్ కు "ఊర్వశి ఓటిటి" ద్వారా రీచ్ కానుండడం మరో అచీవ్మెంట్ గా భావిస్తున్నాను. నా దర్శకత్వంలో రూపొందే తదుపరి చిత్రం వివరాలు అతి త్వరలో ప్రకటిస్తాను" అన్నారు.

 స్వర్గీయ బొద్దుల నారాయణ దివ్యాశీస్సులతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: జయవర్ధన్ ఆంకే, ఛాయాగ్రహణం: రజిని, కూర్పు: రవితేజ గండ్ర, నిర్మాతలు: బొద్దుల లక్ష్మణ్-శైలేష్ తివారి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శైలేష్ తివారి!!