మొదలెట్టిన బాలయ్య. ఇక దబిడి దిబిడే

నందమూరి నటసింహం బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయం సాధించాయి. దీంతో వారిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది.

లాక్‌డౌన్‌కు ముందు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తవ్వగా.. ఆ తర్వాత లాక్‌డౌన్ రావడంతో షూటింగ్ ఆపివేశారు. ఇప్పుడు షూటింగ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆగిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బాలయ్య-బోయపాటి సినిమా షూటింగ్‌ను నేటి నుంచి ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ షూటింగ్‌లో బాలయ్య పాల్గొననున్నారు. షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్‌ వేశారు. బోయపాటి బాలయ్యకు వీరాభిమాని. దీని వల్ల బాలయ్యను ఎలా చూపిస్తే అభిమానులు ఇష్టపడతారనేది బోయపాటికి బాగా తెలుసు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్‌బమ్స్ తెప్పించింది. దీంతో ఈ సినిమా విజయం సాధించడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.